కామారెడ్డిలో భారీ వర్షపాతం నమోదు

KMR: జిల్లాలో వరద బీభత్సం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేవలం 14 గంటల వ్యవధిలో 499 మి.మీ. వర్షపాతం నమోదు కావడం అత్యంత ఆందోళనకరంగా మారింది. వరద నీటిలో లోతట్టు గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. అటు రహదారుల కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి గంటగంటకూ మరింత విషమంగా మారుతోంది.