అమ్మవారి ఆలయంలో చోరీ : ఎస్సై

SKLM: మందస మండలం చిన్న దున్నవూరు గ్రామంలోని పితాలపోలమ్మ ఆలయంలో అమ్మవారి పుస్తెలు, శతమానం బిల్లలు చోరీ కాబడిన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు గర్భగుడి తాళం పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న రెండు జతల బంగారు పుస్తెల కప్పులు, నాలుగు శతమానం బిల్లలు, హుండీలో నగదు దొంగలించారు. మందస ఎస్సై కె.కృష్ణ ప్రసాద్ ఈ సంఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.