నేడు నటుడు శరత్ బాబు జయంతి

ప్రముఖ సినీనటుడు శరత్ బాబు జయంతి. ఈయన శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో 1951 జులై 31న జన్మించారు. తండ్రి విజయ్ శంకర్ దీక్షిత్, తల్లి సుశీల దీక్షిత్. ఈయన డిగ్రీ వరకు శ్రీకాకుళంలోనే చదివి నటనపై ఆసక్తితో సాంఘిక నాటకాలు వేసేవారు. శరత్ బాబు 1973లో సినీరంగంలో ప్రవేశించారు. 220కి పైగా సినిమాల్లో నటించారు. 1981, 88, 89లో ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు.