కారులో చోరీ.. వీడియో వచ్చింది..!
NZB: బోధన్‌లో శుక్రవారం సంచలనం రేపిన కారులో చోరీ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. జాడి జమాల్పూర్‌కు చెందిన హరిబాబు రూ.3 లక్షలు డ్రా చేసి, బ్యాంకు బయట పార్క్ చేసిన కారును లక్ష్యంగా చేసుకున్న దొంగ కారు అద్దాలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లాడు. ఈ మొత్తం ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.