నేడే నితీష్ కుమార్ రాజీనామా
బీహార్ CM మార్పు ఉత్కంఠ నేపథ్యంలో ఇవాళ సీఎం నితీష్ కుమార్ తన MLC పదవికి రాజీనామా చేయబోతున్నారు. మార్చి 16న ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవగా.. సోమవారం ఆయన శాసన మండలి సభ్యుడిగా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, MLC పదవికి రాజీనామా చేసినప్పటికీ, వెంటనే CM పదవికి రాజీనామా చేయకపోవచ్చని తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా, ఒక వ్యక్తి 6 నెలల పాటు CMగా కొనసాగవచ్చు.