అధునాతన అన్నదాన భవనం సిద్ధం

NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తులు అమ్మవారిని దర్శించుకొని కొండ దిగువకు వచ్చే మార్గంలో కనకదుర్గానగర్‌లో అధునాతన అన్నదాన భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ.12 కోట్లతో నిర్మిస్తున్న భవనంలో ఒకేసారి 1200 మంది భోజనం చేసే వసతి, వంటశాల, గదిని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న దసరాకు అన్నదానం ఈ భవనంలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.