VIDEO: ఆటో, బస్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీసీ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి, ఆటో డ్రైవర్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరారైన బస్ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.