VIDEO: నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి
BHPL: చిట్యాల (M) జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 45,000గా అధికారులు అంచనా వేశారు. నకిలీ వైద్య సేవలు అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.