ఈనెల 10 నుంచి టెట్ పరీక్షలు
VSP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు విశాఖపట్నం జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమకుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 11 కేంద్రాలు ఉండగా, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులతో కలిసి మొత్తం 26,248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని చెప్పారు.