దేశంలోనే తొలిసారిగా తిరుమలలో

దేశంలోనే తొలిసారిగా తిరుమలలో

TPT: తిరుమలలో శ్రీవారి ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు అత్యాధునిక 'వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీ'ని ఏర్పాటు చేయనున్నారు. రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించిన దీనిని CM చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ప్రసాదాల తయారీలో వాడే ముడిసరకుల్లో సూక్ష్మ స్థాయి కల్తీని గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక పుణ్యక్షేత్రంలో ఇటువంటి అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి.