సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి

సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ, నస్తూరుపల్లి గ్రామాల్లో ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారని చెప్పారు. రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.