నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
MHBD: మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామపంచాయతీలో శుక్రవారం నామినేషన్ కేంద్రాన్ని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్ పరిశీలించారు. స్థానిక ఎన్నికల 3వ విడత నామినేషన్ స్వీకరణ చివరి రోజు కావడంతో ఆయన కేంద్రాన్ని తనీఖీ చేశారు. అధికార సిబ్బందికి సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐ రాజ్ కుమార్, ఎస్సై కోటేశ్వరరావు ఉన్నారు.