'పోలింగ్ బూతులోకి అనుమతించడం లేదు'

KDP: ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళితే లోనికి అనుమతించడం లేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. మంగళవారం మల్లికార్జునపురం వాసులు ఓటు వేయడానికి వెళ్ళగా అక్కడ సిబ్బంది లోనికి అనుమతించలేదని ఓ మహిళా ఓటర్ మండిపడుతున్నారు. ఉదయమే ఓటేసి తమ పనులను తాము చేసుకుందామనుకుంటే ఓటుకు అవకాశం కల్పించలేదన్నారు. ఇదెక్కడి న్యాయమంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.