శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

NZB: ఎగువ మహారాష్ట్రలో వరదలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు గురువారం మూసివేశారు. గతంలో గోదావరి ఉధృతి కారణంగా 39 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్ష 25 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని ప్రాజెక్టు అధికారి చక్రపాణి తెలిపారు.