'పేద విద్యార్థులకు అండగా కూటమి ప్రభుత్వం'

'పేద విద్యార్థులకు అండగా కూటమి ప్రభుత్వం'

EG: కష్టాల్లో ఉన్న పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో వాంబే గృహాలకు చెందిన విద్యార్థులు యశ్వంత్ (8వ తరగతి), లహరి (5వ తరగతి) కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన చలించిపోయారు. వెంటనే భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి ఆర్థిక సహాయం అందజేశారు.