నేడు మోదీతో భేటీ కానున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఢిల్లీకి చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. వారి సమక్షంలో పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌లతోనూ స్టబ్ భేటీ కానున్నారు.