రాష్ట్ర అర్చక పురోహిత విభాగం కార్యదర్శిగా సురేష్

VZM: ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య పురోహిత విభాగం రాష్ట్ర కార్యదర్శిగా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన ఇనుగంటి సురేష్‌ను నియమిస్తూ బుధవారం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని బ్రాహ్మణుల అభ్యుదయానికి పాటు పడడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.