రాజకీయ ఫ్లెక్సీలపై అధికారులు హెచ్చరిక
WGL: నల్లబెల్లి మండల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని మండల అధికారులు సూచించారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను ప్రత్యేకంగా కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.