చెన్నూరులో పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు
KDP: చెన్నూరు జిల్లా పరిషత్ ప్రాథమిక బాలుర ఉన్నత పాఠశాలలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి పాఠశాల పరిస్థితులపై వివరాలు సేకరించారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.