'మరణించిన గిరిజన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలి'
PPM: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరణించిన గిరిజన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. శుక్రవారం మన్యం కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గిరిజనులు పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఇప్పటికైనా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.