అలంకారప్రాయంగా మారిన క్రీడా ప్రాంగణాలు

KMR: జుక్కల్ మండలం ఖండే బల్లూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఆవరణలో పశువులను కట్టేస్తున్నారు. ఈ క్రీడా ప్రాంగణం ఎదురుగా గ్రామపంచాయతీ భవనంతో పాటు ఆయుష్మాన్ భారత్ వైద్యశాల ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో పాటు ఆయా గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాలు కరువయ్యాయి.