నవంబర్ 3న గోదావరి హారతి కార్యక్రమం
PDPL: మంథని పట్టణంలోని గోదావరి నది తీరంలో ఈనెల మూడవ తేదీ సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకు లోక కళ్యాణార్థం నిర్వహించబోవు గోదావరి మహా హారతి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహక కమిటీ కోరింది. గోదావరి హారతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.