నానో యూరియా వాడకంపై అవగాహన

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో నానో యూరియా వాడకంపై ఏవో రాజశేఖర్ గౌడ్ రైతులకు అవగాహన కల్పించారు. మంగళవారం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు విచ్చేసిన రైతులకు నానో యూరియా గురించి వివరించారు. నానో యూరియా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ప్రత్యేక రకమైన ద్రవరూపమైన ఎరువు అంటూ వివరించారు.