రహదారంతా బురదమయం..!
MDK: వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ పరిసర రహదారి వర్షాల కారణంగా బురదమయమైంది. ఈ దుస్థితిలో సరకుతో వెళ్తున్న డీసీఎం వాహనం బురదలో కూరుకుపోయింది. డ్రైవర్ ఇబ్బందులు పడగా, స్థానికుల సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. ప్రజలు రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.