సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సుధా మూర్తి
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి శనివారం దర్శించుకున్నారు. ఈవో సుజాత, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె.తిరుమలేశ్వరరావు స్వాగతం పలికారు. ఆలయంలోని విశిష్టమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు.