VIDEO: తులం బంగారం ఏమైంది.. మా అల్లుడు అడుగుతున్నారు
HYD: సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించింది. తులం బంగారం ఇస్తామన్నారు ఏమైంది.. మా అల్లుడు అడుగుతున్నాడు అంటూ అడిగింది.