మహిళను ఢీకొట్టి ఆటో డ్రైవర్ పరార్

మహిళను ఢీకొట్టి ఆటో డ్రైవర్ పరార్

హైదరాబాద్‌లో గురువారం మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. చాదర్‌ఘాట్ వద్ద స్కూటీపై వెళ్తున్న సంతోషి అనే మహిళను ఓ ఆటోడ్రైవర్ ఢీకొట్టి పరారయ్యాడు. గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయట్లేదని సమాచారం.