క్లోరిన్ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై ఎమ్మెల్యే ఆరా

క్లోరిన్ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై ఎమ్మెల్యే ఆరా

మన్యం: క్లోరిన్ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి గురించి తెలుసుకున్న ఆయన విజయవాడ నుంచి ఫోన్‌లో స్థానిక నాయకులతో మాట్లాడి ప్రమాదంనకు గల కారణాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నుండి అవసరమైన మేర సాయం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.