తణుకులో విజిలెన్స్ అధికారుల దాడులు

W.G: తణుకులో శనివారం రాత్రి స్టీల్, ఇత్తడి వస్తువుల దుకాణాలపై విజిలెన్స్, తూనికలు కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె. సీతారాము, తూనికలు కొలతల శాఖ అధికారి టి. రాంబాబు తెలిపారు. విక్రయించే వస్తువులపై పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.