VIDEO: మేడారం జాతర నేపథ్యంలో ఇసుక లారీలపై ఆంక్షలు
ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం మేడారం జాతర సందర్భంగా ఇసుక లారీలపై అధికారులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్, భద్రతా కారణాలతో ఈ నెల 12 నుంచి ఇసుక క్వారీలు, లారీలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు బుధవారం అధికారులు తెలిపారు. జాతర ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.