ఆసుపత్రిని జిల్లా కేంద్రంలో కొనసాగించాలని వినతి

మెడికల్ కళాశాలకు తరలించిన జిల్లా ఆసుపత్రిని నారాయణపేట జిల్లా కేంద్రంలో కొనసాగించాలని సీపీఎం నాయకులు సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 13 కిలోమీటర్ల దూరంలో ఆసుపత్రికి వెళ్లేందుకు రోగులు ఇబ్బందులు పడుతున్నారని, నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయంలో ఏర్పాటు చేయాలన్నారు