రోడ్డు చదును చేయించిన ట్రాఫిక్ పోలీసులు

HNK: అదాలత్ జంక్షన్‌లో రోడ్లపై కాజీపేట ట్రాఫిక్ పోలీసులు శనివారం గుంతలు పూడ్చారు. రోడ్లపై గుంతలు ఉండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గమనించిన కాజీపేట ఎస్సై రావెళ్ల రామారావు తన ట్రాఫిక్ సిబ్బందితో కలిసి రెడీమిక్స్ వాహనాన్ని తెప్పించి కంకర పోయించి వారే స్వయంగా రోడ్డు చనువు చేయించారు. దీంతో వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ పోలీసులను అభినందించారు.