'భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'

'భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'

SRPT: మునగాల మండల కేంద్రంలో సీఐటీయూ ఐదవ మహాసభలు సోమవారం జరిగాయి. ఈ మహాసభలో బీసీ డబ్ల్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న, కార్మికులకు సంక్షేమ బోర్డులో పెండింగ్ క్లైములకు సంబంధించి వెంటనే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.