VIDEO: సాగర్ ఎడమ కాల్వపై కోతుల హల్ చల్
SRPT: నడిగూడెం మండల శివారులోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై కోతుల గుంపు వాహనదారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉదయం వేళ ఇంటర్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలు, వ్యవసాయ కూలీలు వానర సైన్యం భయంతో వణికిపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు.