ఇంధన సంక్షోభం.. WFH పరిష్కారమా?
దేశంలో పెరుగుతున్న ఇంధన కొరత దృష్ట్యా కార్పొరేట్ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్రకటించడం సరైన వ్యూహమని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి రవాణాపై ఒత్తిడి తగ్గుతుంది. ఇంటి నుంచే పనిచేయడం ద్వారా ఇంధన పొదుపు సాధ్యమవుతుంది. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయం తీసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.