KTR చేసింది తప్పు: అద్దంకి దయాకర్
TG: ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీమంత్రి KTRను ACB విచారించేందుకు గవర్నర్ అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై MLC అద్దంకి దయాకర్ స్పందించారు. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే. ఈ కేసులో KTR చేసింది తప్పు. అందుకే ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. కక్షసాధింపులని BRS దుష్ప్రచారం మొదలుపెట్టింది. తప్పుచేయలేదని KTR నిరూపించుకోవాలి' అని పేర్కొన్నారు.