ప్రతి గడప నుండి చెత్త సేకరణ జరగాలి: Dy.MPDO
VZM: ప్రతి రోజు ప్రతీ గడప నుంచి చెత్త సేకరణ జరగాలని రాజాం Dy MPDO శ్రీనివాసరావు సూచించారు. ఇవాళ స్దానిక అంతకాపల్లి గ్రామంలో డిప్యూటీ ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మకులకు అందించాలని కోరారు. తడి, పొడి, హానికర చెత్తను వేరువేరుగా సిబ్బంది తప్పకుండా సేకరించాలన్నారు.