'PGRSకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి'
VZM: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోపలే తప్పనిసరిగా పరిష్కరించాలని JC ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల పెండింగ్, గడువు దాటిన, రీ-ఓపెన్ అయిన దరఖాస్తులను పరిశీలించారు. ప్రతి ఫిర్యాదు లబ్ధిదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు.