కొబ్బరి మార్కెట్‌పై యుద్ధ ప్రభావం

కొబ్బరి మార్కెట్‌పై యుద్ధ ప్రభావం

దేశంలోని కొబ్బరి మార్కెట్‌పై పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పడింది. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి గల్ఫ్ దేశాలకు కొబ్బరికాయలు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. దుబాయ్, ఇరాన్, కువైట్, ఒమన్, సౌదీలకు ఎగుమతి చేసేందుకు కాయలను సిద్ధం చేశారు. అయితే, యుద్ధం నేపథ్యంలో చెన్నై, ముంబై, తూత్తుకూడి పోర్టుల్లో కంటెయినర్లు నిలిచిపోయాయి. దీంతో స్థానికంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.