కలెక్టర్ చొరవతో.. 25 ఏళ్ల తర్వాత సొంత గూటికి
KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో, మానసిక స్థితి సరిగ్గా లేక 25 ఏళ్లుగా తప్పిపోయిన జగిత్యాల వ్యక్తి కుటుంబంతో కలిశాడు. రోడ్లపై నిరాశ్రయునిగా ఉన్న అతడికి సంక్షేమ శాఖ ద్వారా వైద్యం, సంరక్షణ అందించారు. శనివారం అధికారులు అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.