సదాశివనగర్ PHCలో 'ఆరోగ్య మహిళ' కార్యక్రమం

KMR: సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజున 'ఆరోగ్య మహిళ' కార్యక్రమం నిర్వహించడం జరిగిందని డా. అస్మా అఫ్షీన్ తెలిపారు. ముఖ్యంగా మహిళలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.