53వ రోజుకు చేరిన మత్స్యకారుల రిలే దీక్షలు
AKP: బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 53వ రోజుకు చేరుకున్నాయి. 'బల్క్ డ్రగ్ పార్క్ వద్దు.. సముద్రం ముద్దు' అంటూ మత్స్యకారులు నినాదాలు చేశారు. తాము ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.