సహపంక్తి భోజనం చేసిన MEO

SKLM: నరసన్నపేట మండలం పోతయ్య వలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో MEO పేడాడ దాలినాయుడు విద్యార్థులతో కలిసి సోమవారం సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులతో కలిసి స్వయంగా భోజనం చేసి ఎంఈవో పరిశీలించారు. అలాగే పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని మధ్యాహ్న భోజనం వేడిగా రుచికరంగా పిల్లల ఇష్టపడే విధంగా ఉండాలని సూచించారు.