పోతిన మహేశ్‌కు వైసీపీలో కీలక పదవి

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నేత పోతిన మహేశ్‌కు ఆ పార్టీలో కీలక పదవి లభించింది. తాజాగా ఆయనను గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా వైసీపీ అధినేత జగన్ నియమించారు. దీంతో ఆయనకు వైసీపీ నాయకులు అభినందనలు తెలిపారు. కాగా ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.