తునికాకు సీజన్ ఆలస్యం.. కూలీల ఆందోళన
BDK: కరకగూడెం మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో తునికాకు సేకరణ ప్రారంభం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉపాధి కోసం సిద్ధంగా ఉన్న కూలీలు ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లో ఉపాధి లభిస్తుండగా, ఈసారి ఆలస్యం అవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేకరణ తేదీలను త్వరగా ప్రకటించాలని కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.