తొండాకూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ

NZB: డొంకేశ్వర్ మండలంలోని తొండాకూర్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రభుత్వపరంగా ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలను స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.