వాగులు దాటి.. వైద్య సేవలు

BDK: వర్షాకాలం వస్తే ఏజెన్సీ ఏరియాల్లో వాగులు, వంకలు, పొంగిపొర్లుతుంటాయి. గ్రామాలకు రోడ్లు లేకున్నా వైద్య సిబ్బంది వాటిని లెక్కచేయకుండా దాటి వెళ్లి సేవలు అందిస్తుంటారు. భద్రాద్రి కొత్తగూడెం(D) మణుగూరు PHC వైద్యులు రోడ్డు సౌకర్యం లేని ఆదివాసీ గూడేలకు వాగులు దాటి వైద్య సేవలు అందిస్తున్నారు.