తొగర్చేడులో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తొగర్చేడులో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

KRNL: క్రిష్ణగిరి మండలం తొగర్చేడు గ్రామంలో అప్పుల భారంతో రైతు బోయ రాజశేఖర్ (37) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పదెకరాల భూమి ఉన్న రాజశేఖర్, గత ఐదేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడం, అధిక వర్షాలకు పంటలు నష్టపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.