VIDEO: వాలు జారుతున్న భీముని పాదం జలపాతం

MHBD: గూడూరు మండలంలో ప్రముఖ పర్యటక ప్రాంతమైన భీమునిపాదం జలపాతం జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతం నుండి నీరు వాలు జారుతున్నది. దీంతో మంగళవారం అక్కడికి వచ్చిన పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. జలపాతం కింద కేరింతల కొడుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.