గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

అల్లూరి: వరరామచంద్రపురం మండలం రేఖపల్లి మినీ గురుకుల పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం గిరిజన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ శివ ప్రసాద్ కోరారు. ఈనెల 4 నుంచి 20 వరకు పాఠశాలలో దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు. ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానం ద్వారా ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.